ఒంగోలు టౌన్: స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేసిన పోలీసులు ఒక విటుడు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాజీరావుపేట పోలేరమ్మ గుడి సమీపంలో ఒక డాబాపై స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో ఒన్‌టౌన్ సీఐ నాగరాజు శనివారం తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు. దాడి చేసిన సమయంలో ఒక విటుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
వారితో పాటు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. నగరంలో ఎక్కడైనా వ్యభిచార గృహాలు నిర్వహించడం, గంజాయి విక్రయిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


