పొదిలి కొండ వివాదంపై హైకోర్టు స్టే
పొదిలి రూరల్: పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంపై పొదిలి–మర్రిపూడి మండలాల్లో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి పొదిలి కొండను మర్రిపూడి మండలంలో కలుపుతున్నట్లు జీవో తెచ్చామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పొదిలి మండల వాసులు పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పృథులగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ పొదిలి కొండ పొదిలికి చెందినదే అనే పూర్తి ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారు దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఈవిషయంపై ఆలయ పరిరక్షణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
ఒంగోలు: రాష్ట్ర స్థాయి అండర్ 20 ఫెన్సింగ్ పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానంలో నిలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ప్రతిభ చాటారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన క్రీడాకారులను బుధవారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.నవీన్, ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి వి.నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.
పొదిలి కొండ వివాదంపై హైకోర్టు స్టే


