రెండో అదనపు ఏపీపీగా నల్లూరి అవనీష్
ఒంగోలు: జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నల్లూరి అవనీష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్పులు ఇచ్చారు. అవనీష్ ఈ హోదాలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. త్రోవగుంటకు చెందిన అవనీష్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. 2014 నుంచి ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు.
7 నుంచి రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నీ
సీఎస్‌పురం(పామూరు): సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.లక్ష, రూ.70 వేలు, రూ.50 అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 6వ తేదీ లోగా రూ.2 వేల ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9666531005, 9441325629 నంబర్లను సంప్రదించాలని కోరారు.
బైక్‌ను ఢీకొన్న లారీ
● వృద్ధుడి దుర్మరణం
పామూరు: మోటార్ బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం పామూరు సరిహద్దులోని 167బీ జాతీయ రహదారి పామూరు నుంచి సీఎస్‌పురం బైపాస్‌పై బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎస్‌పురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మేకల నారయ్య నెల్లూరు జిల్లా నర్రవాడ నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై తన స్వగ్రామం వెళ్తున్నాడు. పామూరు నుంచి సీఎస్‌పురం జాతీయ రహదారి 167బీ బైపాస్‌పై ఎదురుగా వస్తున్న లారీ.. బైక్‌ను సైడ్‌గా ఢీకొట్టింది. ఘటనలో మేకల నారయ్య రోడ్డుపై పడిపోగా ప్రైవేటు అంబులెన్స్‌లో పామూరులోని ఓ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తరలిస్తుండగా క్షతగాత్రుడు మేకల నారయ్య (68) మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులు నక్కల సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జిలానీబాషా తెలిపారు. నారయ్య మృతితో కంభంపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
రెండో అదనపు ఏపీపీగా నల్లూరి అవనీష్


