హవ్వా..ఇదేమి చోద్యం!
● జగనన్న ఫ్లెక్సీ తొలగింపు
గిద్దలూరు రూరల్: వైఎస్సార్ సీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి తన పుట్టిన రోజుతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు హైవేలో ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీని మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. కామూరి రమణారెడ్డి జనవరి 1న తన పుట్టిన రోజు సందర్భంగా 30 అడుగుల జగనన్నతో ఉన్న భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అనుమతులు లేవంటూ జగనన్న ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారి శాంతి మున్సిపల్ సిబ్బంది సాయంతో కటౌట్‌ను ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానికులు జగనన్న ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కామూరి రమణారెడ్డి తాను ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీకి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు తొలగించడం చాలాదారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారులు పాలన కొనసాగిస్తున్నారన్నారు. పట్టణంలో కేవలం కూటమి నాయకులకు చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు, ఎల్‌ఐసీ ఆఫీస్‌తో పాటు ఆర్టీసీ బస్టాండ్ పలు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జగన్ అభిమాని కొప్పుల నరసింహులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారు.
హవ్వా..ఇదేమి చోద్యం!


