CBN: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు పిటిషన్ల విచారణ | Note for Vote Haunting Chandrababu Naidu Rk Petitions Hearing In SC Updates | Sakshi
Sakshi News home page

CBN: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ల విచారణ

Aug 21 2024 12:52 PM | Updated on Aug 21 2024 3:13 PM

Note for Vote Haunting Chandrababu Naidu Rk Petitions Hearing In SC Updates

న్యూఢిల్లీ, సాక్షి: ఓటుకు నోటు కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. అలాగే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్‌ వేశారు. 

జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారణ జరుపుతోంది. పిటిషన్‌ ఆర్కే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్‌ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు. అదే గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు తరఫున రేవంత్‌ రెడ్డి బేరసారాలు జరిపారు. 

.. ఈ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి, ఏ 2 ఉదయసింహ. స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బుల తో రేవంత్ రెడ్డి వచ్చారు. "బ్రీఫ్డ్ మీ" కాల్ లో చంద్రబాబు అయిదు కోట్ల ఆశ చూపారు అని వాదించారు. ఈ పిటిషన్లపై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. 

సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ల విచారణ

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement