సర్కారు దాష్టీకం.. నెత్తురోడుతున్న ‘స్థానికం’ | Nomination process for ZPTC and MPTC elections turns into a battleground | Sakshi
Sakshi News home page

సర్కారు దాష్టీకం.. నెత్తురోడుతున్న ‘స్థానికం’

Oct 22 2026 5:44 AM | Updated on Oct 22 2026 5:44 AM

Nomination process for ZPTC and MPTC elections turns into a battleground

మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కారుపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

రణరంగంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్‌.. అదే దౌర్జన్యం, అవే దాడులు 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కున్న టీడీపీ గూండాలు 

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పచ్చ మూకల విధ్వంసం 

తొలిరోజు నామినేషన్ల ప్రక్రియలో 76 చోట్ల దాడులు, దౌర్జన్యాలు

అంతటా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన పోలీసులు

కడపలో పేట్రేగిపోయిన రౌడీ మూకలు.. అడుగడుగునా అడ్డగింత 

తిరుపతి కలెక్టరేట్‌ వద్ద 40 మంది ఎంపీటీసీ అభ్యర్థులతో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధర్నా  

జీడీ నెల్లూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై పచ్చ గూండాల దాడి

వాకాడులో పచ్చ మూకల దాడి.. వైఎస్సార్‌సీపీ నేతలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు 

పొదిలిలో మహిళ చీరలాగి.. దాడి చేసి.. నామినేషన్‌ పత్రాలు చింపివేత 

తొండంగిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కారు డ్రైవర్‌కు గాయాలు

సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నామినేషన్లలోనూ టీడీపీ మూకలు అదే దౌర్జన్యం, దాడులు, దాష్టీకాన్ని కొనసాగించాయి. మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు వేయనీయకుండా అడ్డంకులు ఎదురైన చోట పోలీస్‌ భద్రత కల్పించి నామినేషన్లు వేయించేలా చూడాలని ఎస్‌ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల పరిధిలోని 659 జెడ్పీటీసీ, 659 మండల పరిషత్‌ల పరిధిలోని 9,829 ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల తొలి రోజైన బుధ­వారం 76 ప్రాంతాల్లో ఎల్లో గూండాలు యథేచ్ఛగా దా­డులు, దౌర్జన్యాలకు బరితెగించారు. 

స్థానిక సంస్థ­ల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వెన్నుపోటు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పులివెందుల, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ తిదితర జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ నేతలపై దాడులు, బెదిరింపులు, గృహ నిర్బంధాలు, నామినేషన్‌ పత్రాల దాఖలుకు ఆ­టంకాలు కొనసాగాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ భయానక వాతావరణం సృష్టించారు. జీడీ నెల్లూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక్క అభ్యర్థిని కూడా నామినేషన్‌ వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. 

పలుచోట్ల నామినేషన్‌ పత్రాలను చించివేశా­రు. వెన్నుపోటు పార్టీ రౌడీల దౌర్జన్యం, పోలీసులు, అధికారుల ఉదాసీన వైఖరిని నిరసిస్తూ తిరుపతి కలెక్టరేట్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితర వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులతో కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాగానే టీడీపీ మూకలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రాజా కారు డ్రైవర్‌ గాయపడ్డాడు. 

చిత్తూరులో రెచ్చిపోయిన పచ్చ గూండాలు 
చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌.పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, వి.కోట, గుడుపల్లె వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను చిత్తూరు జెడ్పీ కార్యాలయం వద్ద పహారా కాసిన టీడీపీ గూండాలు చింపేశారు. గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్‌ నామినేషన్లు తీసుకునే చిత్తూరు జెడ్పీ కార్యాలయం వద్ద స్వయంగా కాపుకాచి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చే­యించారు. జెడ్పీటీసీ అభ్యర్థులు జగదీష్‌రెడ్డి, ప్రకాష్, దేవప్పనాయుడు, శ్రీనివాసరెడ్డి, దేవిప్రియకు రక్తగాయాలయ్యాయి. ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన బంగారుపాళ్యం, వెదురుకుప్పం, వి.కోట, చిత్తూరు మండలాల్లో అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులు చేశారు.

నామినేషన్‌లు వేస్తున్న వారికి పచ్చ మూకలు అడ్డంకులు కల్పించి దాడులు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. తిరుపతి జిల్లా తొట్టంబేడులో నామినేషన్ల సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కు­మార్తె పవిత్రారెడ్డి, కుమారుడు అక్షర్‌రెడ్డికి పచ్చ మూ­కలు అడ్డంకులు కల్పించి దాడులు చేయడంతో ఉద్రి­క్తత చోటు చేసుకుంది. ఇదే అదనుగా పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల­కు గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి డ్రైవర్‌ ప్రభుత్వ సర్వేయర్‌పై సి­మెంట్‌ ఇటుకలతో దాడి చేశాడు. అతని తలకు తీవ్ర గాయమైంది. 

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో వైఎస్పార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను రౌడీ­లు లాగేశారు. పార్టీ మండల కన్వీనర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ను పోలీస్‌స్టేషన్‌లో అక్రమ నిర్బంధం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద లింగమనాయుడు పల్లె మాజీ సర్పంచ్‌ గుడ్లూరు వెంకటరమణ నాయుడు కారును టీడీపీ నేతలు కాసారం రమేష్, టీడీపీ తొట్టంబేడు మండలం అధ్యక్షుడు మునిరాజ నాయుడు కారుపై ఎక్కి కారును ధ్వంసం చేశారు. ఆయన్ను కింద పడేసి దాడి చేశారు.  శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం లో తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి నామినేషన్‌ కేంద్రానికి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.  

చంద్రగిరి మండలంలో కిరాతకం 
ఎంపీటీసీ నామినేషన్ల పర్వంలో టీడీపీ గూండాలు సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో అరాచకం సృష్టించారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై గంజాయి బ్యాచ్‌లతో దాడులకు తెగబడ్డారు. తలలు పగలగొట్టి, కాళ్లతో తన్నుకుంటూ, వాహనాలను ధ్వంసం చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని కుమారుడు పులివర్తి వినీల్‌ సమక్షంలో దమనకాండ జరుగుతున్నా..అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఎంపీటీసీ అభ్యర్థి దెయ్యాల మాధవ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. తొండవాడ ఎంపీపీ అభ్యర్థి మల్లం దీపికా రెడ్డికి ప్రపోజర్‌గా వెళ్లిన రాము అనే వ్యక్తి తలపై ఇనుప రాడ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. 

స్థానికంగా ఉండే విజయ్‌ ఆచారి అటుగా వెళ్తుండడంతో టీడీపీకి చెందిన కిరాయి గూండాలు అతనిపై దాడిచేసి విచక్షణారహితంగా కాళ్లతో కొట్టారు. తిరుపతి రూర­ల్‌ మండలం సి.మల్లవరం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిమ్మారెడ్డి, అతని ప్రపోజర్లు మున స్వామి రెడ్డి, లోక నాథ రెడ్డిలపై టీడీపీ నేతల మూకుమ్మడి దాడి­చేసి నామినేషన్‌ పత్రాలను చించేశారు. పాకాల మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులచే నామినేషన్‌ దాఖలు చేయకుండా  టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నామినేషన్‌ కేంద్రానికి వేస్తే చంపుతా­మని అభ్యర్థులను బెదిరించారు. టీడీపీ దౌర్జ­న్యాన్ని నిరసిస్తూ తిరుపతి రూరల్‌ మండలం నుంచి 40 మంది ఎంపీటీసీ అభ్యర్థులతో చంద్రగిరి వైఎస్సార్‌­సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి నిరసన తెలిపారు.

నెల్లూరు జిల్లాలో భయోత్పాతం  
నెల్లూరు జిల్లా చిట్టమూరులో ఎల్లో గ్యాంగ్‌ భయో­త్పాతం సృష్టించింది. నామినేషన్‌ కేంద్రం వద్ద మోహరించిన 500 మందికి పైగా పచ్చ రౌడీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా దౌర్జన్యం చేశారు. పలువురికి గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతల కారు ధ్వంసం చేశారు. పోలీసులను ప్రయోగించి బెదిరింపులకు దిగారు. నామినేషన్‌ పూర్తిగా విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులకు టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. కోట తదితర చోట్ల వైఎస్సార్‌సీపీకి చెందిన వారి నామినేషన్లు వేయనీయలేదు. గూడూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు లాక్కొని చించేశారు. 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా వేధించా­రు. వాకాడులో నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ జెడ్పిటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు లాక్కుని కర్రలతో దాడి చేసి రక్త గాయాలు చేశారు. పోలీసులు మాత్రం బాధితులపైనే కేసులు పెట్టారు. ఆ దృశ్యాన్ని రికార్డు చేస్తున్న వారి నుంచి సెల్‌ ఫోన్లను లాక్కొని పగులగొట్టారు. 

టీడీపీ మూకల అరాచకంపై వైఎస్సార్‌సీపీ వెంకటగిరి ఇన్‌చా­ర్జ్‌ నేదురుమల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయ­గిరి నియోజకవర్గం సీతారామపురంలో వైఎ­స్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయనీయకుండా పోలీసులే అడ్డుకున్నారు. గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీ మూకలు ఎంపీటీసీ అభ్యర్థు­ల కార్ల అద్దాలు ధ్వంసం చేశాయి. గూడూరు, చి­ల్ల­కూ­రు, కోట, వా­కా­డు, చిట్టమూరు మండలాల్లో దాడులకు పాల్పడ్డారు.    

పుంగనూరులో మారని తీరు 
పుంగనూరులో గత శుక్రవారం నాటి ఘటనను టీడీపీ శ్రేణులు మళ్లీ పునరావృతం చేశారు. నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థుల నుంచి పత్రాలను లాక్కున్నారు. రాళ్లతో దాడి చేయడమే గాక మహిళల పుస్తెలను లాగేశారు. ముందే సిద్ధం చేసుకున్న కర్రలు, రాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న మాజీ ఎంపీ, దళిత నాయకుడు రెడ్డెప్పపై దాడి చేశారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఈశ్వరమ్మపై దాడి చేసి తాళిబొట్టు, చైను లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోబోగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగాయి. 

చౌడేపల్లిలో టీడీపీ శ్రేణులు అడ్డుకొని వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలు సునీల్‌ శివప్రకాశ్‌ రెడ్డి, ఓబులేసుపై దాడి చేసి కొట్టారు. మదనపల్లిలో జడ్పిటిసి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి కిరణ్మయిపై దాడి చేశారు. అసభ్యంగా ప్రవర్తించి నామినేషన్‌ పత్రాలను లాక్కొని వెళ్లారు. మదనపల్లెలో ఎంపీ మిథున్‌ రెడ్డిని ఆయన కార్యాలయం నుంచి బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారు. పోలీసుల తీరు, నామినేషన్లను అడ్డుకుంటు­న్నందుకు నిరసనగా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్త­లు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పీలేరులో వైఎస్‌ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 2 గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మె­ల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గంలో పర్యటించరాదని పోలీసులు నోటీసులిచ్చారు.  

పల్నాడులో అదే దౌర్జన్యం 
పల్నాడు జిల్లా రొంపిచర్లలో నామినేషన్లు వేసేందుకు చెరువుగట్టు సెంటర్‌ నుంచి అభ్యర్థులతో బయలుదేరి వస్తున్న మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించగా పోలీసులు లాఠీలను ఝుళిపించారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను, ప్రతిపాదిత దారులను పాలకేంద్రం, పోలీసుస్టేషన్‌ మధ్యలో టీడీపీ శ్రేణులు దాడిచేసి నామినేషన్‌పత్రాలు చించేశారు. పోలిమేర నాగిరెడ్డి, పొలిమేర వెంకటరెడ్డిలు గాయపడ్డారు. రెంటచింతల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి నామినేషన్‌ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో పచ్చ మూకలు స్వైర విహారం చేశాయి. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. నరసరావుపేటలో ఆర్డీఓ కార్యాలయం నామినేషన్‌ కేంద్రం వద్ద జడ్పీటీసీ అభ్యర్థి భారతి, ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై ఎల్లో గూండాలు దాడి చేశారు. గాయపడిన పెద్ద లక్ష్మారెడ్డిని ఆసుపత్రికి తరలించా­రు. దాచేపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి వంగా పద్మావతిపై టీడీపీ రౌడీలు దాడి చేసి కొట్టారు. రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వీరాటం గ్రామానికి చెందిన వైఎ­స్సా­ర్‌సీపీ అభ్యర్థులకు చెందిన బీ ఫారాలను లాక్కోవడంతో ఘర్షణ తలెత్తింది. 

మాచర్లలో ఎంపీటీసీ నా­మి­నేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. అమరావతి జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బంక దీనమ్మ, బంక విష్ణుపై దాడిచేసి నామినేషన్‌ పత్రాలను చించేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ఉదయం నుంచే హౌస్‌ అరెస్టు చేశారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ అరాచకం 
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో టీడీపీ అరాచక పర్వం కొనసాగింది. మంత్రాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి ఓటరు లిస్టు కోసం వెళితే నామినేషన్‌ వేసేందుకు వచ్చారని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బనగానిపల్లె మండలంలో 25 గ్రా­మా­లకు చెందిన 75 మంది నేతలను బైండోవర్‌తో నిర్బంధించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధర్నాకు దిగారు. ప్యాపిలి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న పోదు కృష్ణమూర్తిని  ఏ కార­ణం చెప్పకుండా పోలీసు­లు అదుపులోకి తీసుకున్నా­రు. 

ఆళ్లగడ్డ మండలం బాబేపల్లె వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కసెట్టి నాగేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఉల్చాల ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం సీపీఎం అభ్యర్థులు మధుసూధన్, రాఘవేంద్రలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు చితకబాదారు. గోస్పాడు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు 12 ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా ఎస్‌ఐ సుధాకరరెడ్డి అడ్డుకున్నారు. చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షిని, కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను గృహ నిర్బంధం చేశారు.  

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రి­యలో కూటమి మూకలు దౌర్జన్యకాండ సాగించాయి. తాడిమర్రి మండలంలో 9ఎంపీటీసీ స్థానాలు ఉండ­గా, 8 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు ఉదయాన్నే వచ్చారు. పోలీసులు 4 గంటల వరకు కా­లయాపన చేయించారు. తర్వాత వారు నామినేషన్‌కు వేయబోగా, టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యు­డు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి వీరంగం చేశారు. చంద్రశేఖ­ర్‌రెడ్డి కోడళ్ల (ఒకరు నిండుగర్భిణి, మరొకరు బాలింత)ను పక్కకు తోసే­శారు. ముదిV­ý ుబ్బ, బత్తలపల్లి మండ­లాల్లోనూ వైఎ­స్సా­ర్‌సీపీ అ­భ్యర్థులు నామినేషన్లు వే­యకుండా ఆటంకాలు సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట­రా­మిరెడ్డిని ధర్మవరం పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

మహిళ అభ్యర్థి చీర లాగి..
మార్కాపురం జిల్లా పొదిలిలో నామినేషన్‌ వేస్తున్న సూదనగుంట వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దొనపాటి శ్రావణి చీర లాగి.. రక్తం వచ్చేలా దాడి చేసి కొట్టారు. నామినేషన్‌ పత్రాలను ఎల్లో రౌడీలు చించేశారు. జిల్లాలో పలు­చోట్ల దాడులు చేస్తున్న వారిని వదిలేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారిని బలపరిచేందుకు వెళ్లిన వారిని పోలీసులు తరిమి కొట్టారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం చింతగుంపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పోలు వరలక్ష్మి, పెద్ద ఎర్లపాడు ఎంపీటీసీ స్థానానికి పోలు జయరాం రెడ్డిలు నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ గూండాలు రాళ్లు, కత్తులతో దాడి చేశారు. నామినేషన్లు లాక్కొని చించేశారు. 

గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలో కోర్టు ఆర్డర్‌ కాపీలను ఏఆర్‌ఓకు చూపించేందుకు వెళ్తున్న బేస్తవారిపేట మాజీ ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి షేక్‌ మున్వర్‌బాషాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుని చింపేశారు. ఎంపీటీసీ అభ్యర్థి ఈశ్వరరెడ్డి నామి­నేషన్‌ పత్రాలను లాక్కున్నారు. నామినేషన్‌ వేయనీయక పోవడంతో నేకునాంబాద్‌కి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఎస్‌ శ్రీరాములు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశా­రు. 

గిద్దలూరు నియోజకవర్గం కంభం నాయక్‌­వీధి ఎంపీటీసీ అభ్యర్థి మహమ్మద్‌ రఫీ నామి­నేషన్‌ను చింపేశారు. కందులాపురం తూర్పు అభ్యర్థి పెరుమారెడ్డి నందిరెడ్డి, కందులాపురం పడమర అభ్యర్థి బొర్రా నాగభూషణం నామినేషన్‌  పేపర్లను చించేశారు. అర్థవీ­డు, రాచర్ల మండలంలో పచ్చమూకలు విలేకర్లపైనా దాడులకు తెగబడ్డాయి. ప్రకాశం జిల్లా దర్శి, కొండపి నియోజకవర్గాల్లోనూ అదే దౌర్జన్యం కొనసాగింది.  

అనంతలో అడుగడుగునా దౌర్జన్యం 
అనంతపురం జిల్లా పామిడి మండలం కొత్తపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమేష్‌ను నామినేషన్‌ వేస్తే కాళ్లు విరగ్గొడతామని పచ్చ రౌడీలు ఫోన్‌కాల్స్‌ చేసి బెదిరించారు. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు కల్పించిన పచ్చ రౌడీలు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ‘ప్రాదేశిక’ ఎన్నికల నామినేషన్లలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో అధికార పార్టీకి చెందిన మట్కా, పేకాట నిర్వాహకులు, గంజా­యి విక్రయదారులు, వీధి రౌడీలను నియోజకవర్గంలోని పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండల కేంద్రాల్లో జరుగుతున్న నామినేషన్‌ కేంద్రాల వద్ద పదుల సంఖ్యలో మోహరించి.. అక్కడ వైఎస్సార్‌సీపీ వర్గీయులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశా­రు. 

పామిడి–6 ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేష్‌పై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డాయి. రాప్తాడు నియోజకవర్గంలో ఎ­మ్మెల్యే పరిటాల సునీత డైరెక్షన్‌లో టీడీపీ శ్రేణు­లు అరాచకాలకు ఒడిగట్టారు. మరూరు ఎంపీటీసీ స్థా­నం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూజారి ప్రతిమ నామినేష­న్‌ పత్రాలను లాక్కుని, ప్రతిపాదకులపై దాడి చేశారు.  పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వాహనాలకు నిప్పు కడపలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. జెడ్పీటీసీలకు నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై భౌతికదాడులకు దిగారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ముట్టడించి, టీడీపీ గూండాలకు సహకరించారు. 

జెడ్పీ మెయిన్‌ గేటు వరకూ పోలీసులు అంచెలంచెలుగా బారికేడ్లు పెట్టి వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిలువరించారు. ఫలితంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 39 జడ్పీటీసీలుంటే ఒక్కటంటే ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. పులివెందులలో భయోత్పాతం సృష్టించి లబ్ధిపొందాలనే దిశగా తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తోంది. కేసులతో సంబంధం లేనోళ్లను కూడా అరెస్టులకు పురిగొల్పుతున్నారు. బుధవారం వేకువజామున కౌన్సిలర్‌ అభ్యర్థుల ఇళ్ల వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీ అభ్యర్థులతోపాటు జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌రామాంజులరెడ్డితో కలిసి రాగా, నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. 

జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌కు ఫోన్‌ ద్వారా విన్నవించినా నిష్ప్రయోజనమే అయ్యింది. మద్యాహ్నం తర్వాత రమ్మని చెప్పారు. ఆ సమయంలో టీడీపీ మూకలు చెలరేగిపోయాయి. రాళ్లు, బీరు బాటిళ్లుతో దాడులు చేశారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలు జడ్పీ ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ రౌడీలతో తిష్టవేసిన పుత్తా, దేవగుడి కుటుంబ వర్గాల రౌడీలు అడ్డుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండీ టీడీపీ రౌడీ మూకలు అడ్డుకున్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టీడీపీ రౌడీ మూకలు, గూండాలు రెచ్చిపోయారు. సాక్షి విలేకరి నాగార్జునపై టీడీపీ మూకలు ఒక్కసారిగా దాడి చేశాయి. సెల్‌ ఫోన్‌ను పగులగొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రైల్వే కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగారు.  

పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వాహనాలకు నిప్పు
కడపలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. జెడ్పీటీసీలకు నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై భౌతికదాడులకు దిగారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ముట్టడించి, టీడీపీ గూండాలకు సహకరించారు. జెడ్పీ మెయిన్‌ గేటు వరకూ పోలీసులు అంచెలంచెలుగా బారికేడ్లు పెట్టి వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిలువరించారు. ఫలితంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 39 జడ్పీటీసీలుంటే ఒక్కటంటే ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. పులివెందులలో భయోత్పాతం సృష్టించి లబ్ధిపొందాలనే దిశగా తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తోంది. కేసులతో సంబంధం లేనోళ్లను కూడా అరెస్టులకు పురిగొల్పుతున్నారు. 

బుధవారం వేకువజామున కౌన్సిలర్‌ అభ్యర్థుల ఇళ్ల వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీ అభ్యర్థులతోపాటు జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌రామాంజులరెడ్డితో కలిసి రాగా, నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌కు ఫోన్‌ ద్వారా విన్నవించినా నిష్ప్రయోజనమే అయ్యింది. మద్యాహ్నం తర్వాత రమ్మని చెప్పారు. ఆ సమయంలో టీడీపీ మూకలు చెలరేగిపోయాయి. రాళ్లు, బీరు బాటిళ్లుతో దాడులు చేశారు. 

అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలు జడ్పీ ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ రౌడీలతో తిష్టవేసిన పుత్తా, దేవగుడి కుటుంబ వర్గాల రౌడీలు అడ్డుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండీ టీడీపీ రౌడీ మూకలు అడ్డుకున్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టీడీపీ రౌడీ మూకలు, గూండాలు రెచ్చిపోయారు. సాక్షి విలేకరి నాగార్జునపై టీడీపీ మూకలు ఒక్కసారిగా దాడి చేశాయి. సెల్‌ ఫోన్‌ను పగులగొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రైల్వే కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగారు.    

ఈసీ.. ఇటు చూడు!
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృష్ణవేణి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి ప్రకాష్‌ పరిశీలించారు.. ఆ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకుని పక్కన పెట్టుకోబో­తున్నారు.. అంతలో ఆయన చేతి నుంచి మంత్రి సవిత అనుచరుడు, టీడీపీ నేత సుబ్బారెడ్డి ఒక్క ఉదుటున లాక్కొని చింపేశాడు.. పక్కనే పోలీసులున్నా, ఇతర అధికారులు ఉన్నా జోక్యం చేసుకోని దుస్థితి.. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఇంత కంటే నిదర్శనం ఉండదు.. రాష్ట్రంలో టీడీపీ అరాచకానికి ఈ ఒక్క చిత్రం మచ్చుతునక.

మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌ పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులతో నామినేషన్లు వేయడానికి బుధవా­రం చిత్తూరు జెడ్పీ కార్యాలయానికి నా­రా­యణస్వామి బయల్దేరారు. దారిలో మాటువేసిన గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్, ఆ పార్టీ నేత చిట్టిబాబు నాయుడు, వందలాది మంది టీడీపీ గూండాలు ఇనుప రాడ్లు, రాళ్లతో నారా­యణస్వామిని చంపడానికి ప్రయత్నించారు.

కారు తలుపు మూసేయడంతో ఆ­యన తృటిలో ప్రాణాపాయం నుంచి త­ప్పించుకున్నారు. కారులో ఉన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులను టీడీపీ గూండాలు చావబాదారు. ఓ దశలో పచ్చ­మూకలను నారాయణస్వామి అ­భ్యర్థిస్తూ చేతులెత్తి దండం పెడుతున్నా కనికరించలేదు. డ్రైవర్‌ చాకచక్యంతో కా­రు ముందుకు పోనివ్వడంతో తప్పించు­కున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు­లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement