‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి | NMC Approves 100 MBBS Seats for Piduguralla Medical College | Sakshi
Sakshi News home page

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

Jul 13 2026 3:00 PM | Updated on Jul 13 2026 4:00 PM

 NMC Approves 100 MBBS Seats for Piduguralla Medical College

విజయవాడ: పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలించింది. 

గత వైఎస్ జగన్ ప్రభుత్వం పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది. 17 మెడికల్ కాలేజీల్లో భాగంగా పిడుగురాళ్ల కాలేజీని నిర్మించారు. పల్నాడు జిల్లా ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు వైఎస్ జగన్. 95 శాతం పనులు వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల ప్రారంభం కానుంది. 

ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం వల్ల పల్నాడు ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందడమే కాకుండా, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే సువర్ణావకాశం లభించనుంది. వైఎస్‌ జగన్‌ దూరదృష్టితో చేసిన ఆలోచనతో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది ఓ చక్కటి అవకాశం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement