సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీద రౌడీయిజం చేస్తోందని వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి అంబటిరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల మీదకు పోలీసులు బుల్డోజర్లను పంపే సంస్కృతి తొలిసారిగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవటం అత్యంత దుర్మార్గమని రైతుల భూములు లాక్కుని కాంట్రాక్టర్లకు కట్టబెడతారా అని ప్రశ్నించారు.
అంబటి మాట్లాడుతూ.. చిన్నచిన్న రైతుల మీద బలవంతపు చర్యలేంటి చంద్రబాబూ? పూలింగులో భూములు ఇవ్వకపోతే కక్ష కడతారాహైకోర్టులో కేసు ఉండగానే భూములు లాక్కుంటారా? ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారణే 2.75 ఎకరాల్లో పంటలను బుల్డోజర్లతో తొక్కించారు.పూలింగులో భూమి ఇవ్వకపోతే ఇలా తొక్కించేస్తారా రైతుల మీద చంద్రబాబుకు ఎంతకంత కక్ష? అని అంబటి ప్రశ్నించారు.
రూ.8 కోట్ల విలువైన భూమికి కేవలం రూ.2.47 కోట్లు ఇస్తామనటం అన్యాయమని సీఎం రమేష్ ఒక్కో ఎకరం డాక్యుమెంట్ల ప్రకారమే రు.5 కోట్లకు కొన్నారని విడిగా ఇంకా ఎక్కువ ధరే చెల్లించారు.మరి రైతులకు రూ.2.47 కోట్లు ఎలా ఇస్తారని వారి నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లకు అప్పనంగా దోచిపెడతారా అని అడిగారు.

సీఆర్‌డీఏ అధికారులు సైతం బ్రోకర్ల అవతారమెత్తారని బలవంతంగా భూములు అమ్మించి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. రైతులను బలవంతంగా భూముల్లో నుండి లాగేస్తే సహించేది లేదని మా పోరాటం చివరి వరకూ సాగుతుందన్నారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్న చంద్రబాబు రైతులను అన్యాయం చేయటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.


