
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసింది. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే.. పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) కప్పదాటు సమాధానం చెప్పారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎమ్మెల్యేలు ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డీఏ, బకాయిలపై ప్రశ్నించారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు. ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపక్ష ప్రశ్నలకు మంత్రి పయ్యావుల కేశవ్.. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీ అంశం పరిశీలనలో ఉందన్నారు. ఎప్పుడిస్తారు అనే సమాధానం చెప్పకపోవడం గమనార్హం.
అలాగే, ఎంత ఇస్తారు అనేది కూడా మంత్రి పయ్యావుల చెప్పకుండా దాటవేశారు. అయితే, డీఏ బకాయిలు మాత్రం రూ.12,119 కోట్లు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు. ఈ సమాధానాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఇది కూడా చదవండి: అయ్యా లోకేష్.. నా గోడు పట్టదా!