దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు: మేరుగ నాగార్జున | Minister Merugu Nagarjuna Slams Chandrababu Over Scheduled Caste Welfare | Sakshi
Sakshi News home page

దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు: మేరుగ నాగార్జున

Apr 14 2022 3:42 PM | Updated on Apr 14 2022 4:36 PM

Minister Merugu Nagarjuna Slams Chandrababu Over Scheduled Caste Welfare - Sakshi

దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? నిలదీశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా? అని మండిపడ్డారు.

సాక్షి, తాడేపల్లి: దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ  మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? నిలదీశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా? అని మండిపడ్డారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని దుయ్యబట్టారు.

దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో దళిత జాతిపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవానికి నాంది పలికింది సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బినామీలు, దళారులకే దక్కేవని తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement