
రిటైర్డ్ ప్రొఫెసర్‌కు కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు అరెస్ట్
విశాఖపట్నం: ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.49.72 లక్షలు దోచుకున్న రిలేషన్‌షి ప్ మేనేజర్ సతీష్ కుమార్‌ను నగర సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. డిజిటల్ మోసాలపై సైబర్ క్రైం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంవీపీకాలనీ, సెక్టార్–6కి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్‌తో నిందితుడు సతీష్ కుమార్ ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి పెట్టుబడి పెట్టాలంటూ ఆశ చూపా డు. తద్వారా అతని నుంచి దశలవారీగా రూ.49.72 లక్షలు కాజేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని సెక్టార్–16కి చెందిన సతీష్ కుమార్‌గా గుర్తించారు.
నిందితుడు నోయిడా వరల్డ్ ట్రేడ్ టవర్‌లో రిలేషన్íÙప్ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సతీష్ కుమార్ తన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి భారీ మోసాలకు సహకరించినట్లు తేలింది. ఈ అకౌంట్ ద్వారా వారు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 111(2), 319(2), 318(4) రెడ్/విత్ 61(2) బీఎన్‌ఎస్, 66–సీ, 66–డీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు(నం. 112/2025) నమోదు చేసి అరెస్ట్ చేశారు.