మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్‌ | Jana Sena MLA Bolisetti Srinivas Comments Viral Once Again | Sakshi
Sakshi News home page

మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్‌

Sep 12 2026 6:54 PM | Updated on Sep 12 2026 7:06 PM

Jana Sena MLA Bolisetti Srinivas Comments Viral Once Again

సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: మరోసారి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జనసేన కార్యకర్తలను కూలీలుగా చూడొద్దని చంద్రబాబును బొలిశెట్టి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలంగా ఉన్నచోట్ల మనమే పోటీ చేద్దామని జనసేన శ్రేణులకు బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

కాగా, స్థానిక ఎన్నికలపై అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశంలో బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన చోట జనసేన సైనికులను తొక్కేస్తున్నారు.. జనసేన గెలిచిన చోట మాత్రం టీడీపీ వాళ్లను మనం గౌరవిస్తున్నాం’  అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.

టీడీపీ నాయకులు మనల్ని తొక్కేస్తున్న విషయం మన పార్టీ నాయకులకు కూడా తెలుసని, వారి తీరుపై తాను సీఎం చంద్రబాబుతో కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో మాట్లాడతానని అన్నారు. ‘మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మీరే పవన్‌ కళ్యాణ్‌కు బలం, మాకు బలగం. ఈ రెండున్నరేళ్లు మీ బాధను చూశాం. ఇక నుంచి మీరు బాధపడకుండా చూసుకోవాలి్సన బాధ్యతను జనసేన తీసుకుంటుంది’ అని చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్‌ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. జనసేన అనుబంధ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.

ఇదీ చదవండి: ఆయన మనకెందుకు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement