కొండపై విష‘నాగులు’ | Illegal activities are rampant on Nagulakonda in Anakapalle | Sakshi
Sakshi News home page

కొండపై విష‘నాగులు’

Jun 9 2025 2:14 AM | Updated on Jun 9 2025 2:14 AM

Illegal activities are rampant on Nagulakonda in Anakapalle

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరపుకోట పంచాయతీ శివారు భమిడికలొద్ధి గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న నాగులకొండపై పొక్లెయిన్‌తో లేటరైట్‌ అక్రమ తవ్వకాలు

అనకాపల్లి జిల్లాలోని నాగులకొండపై చెలరేగుతున్న అక్రమార్కులు  

రోజుకు 15 వేల టన్నులకు పైగా లేటరైట్‌ తరలింపు

లెక్కల్లో చూపిస్తున్నది 5 వేల టన్నులే.. తద్వారా రూ. కోట్ల మేర రాయల్టీ ఎగవేత

అనుమతించింది 60 అడుగుల లోతు వరకే.. కానీ 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు.. వే బ్రిడ్జి లేదు.. లెక్కా పత్రాలూ లేవు

హై గ్రేడ్‌ లేటరైట్‌ ఒడిశాలోని వేదాంత ప్లాంట్‌కు తరలింపు

యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం.. గిరిజనుల జీవనానికి పెనుముప్పు  

నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్‌ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్‌ తవ్వకా­లు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.

నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్‌ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్‌కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్‌ తవ్వకా­లు చేపడుతున్నారు.  సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. 

ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్‌ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్‌ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. 
       – సాక్షి టాస్క్‌ఫోర్స్‌

గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీ
కూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్‌ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్‌ మైన్‌ ని హెక్టార్‌కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభు­త్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. 

ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్‌ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావల­సిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.

విలువైన హై గ్రేడ్‌ లేటరైట్‌..
నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్‌ (ఉన్నత శ్రేణి) లేటరైట్‌ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్‌ అనేది ఇనుప ఖనిజం (ఐరన్‌ ఓర్‌) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్‌ కంపెనీలకు కాకుండా స్టీల్‌ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. 

మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్‌ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమ­తులు తీసుకున్నారు. అల్యూమి­నియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్‌కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.
వర్షంలో సైతం లేటరైట్‌ను తరలిస్తున్న టిప్పర్లు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం
నిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణ
రూ.5 కోట్ల మేర జరిమానా వసూలు

నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్‌ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్‌ను ఎక్కువగా తవ్వి­నట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 

2023 జూన్‌లో  మైనింగ్‌ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్‌ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్‌ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేట­రైట్‌ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. 

పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్‌ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్‌ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్‌ వాహనాల్లో లేటరైట్‌ తరలిపోతోంది.

‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియా
నాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్‌ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్‌ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం  రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్‌ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్‌ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement