వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు | Heavy Rains For A Week In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Jul 25 2025 3:12 PM | Updated on Jul 25 2025 3:29 PM

Heavy Rains For A Week In Andhra Pradesh

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. సాగర్ ఐలాండ్‌కు 80 కి.మీ, కలకత్తాకు వంద కి.మీ దూరంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కిమీ వేగంతో ఈదుగు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పార్టీలకు మొదటి ప్రమాద హెచ్చరికను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement