సాక్షి, విశాఖ : వాతావరణ శాఖ నేడు ( సోమవారం) రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. కాకినాడ,అల్లూరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వానలు ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వానలు లేని చోట ఎండల తీవ్రత సైతం అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది.


