ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి | Hearing On Ambati Rambabu Petition In Ap High Court | Sakshi
Sakshi News home page

ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి

Apr 2 2025 4:04 PM | Updated on Apr 3 2025 8:48 AM

Hearing On Ambati Rambabu Petition In Ap High Court

సాక్షి, విజయవాడ: సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌, తన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ అసభ్యంగా పోస్టులు పెట్టిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన రిట్  పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్‌గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు.

తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ అంబటి ప్రశ్నించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్‌ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement