breaking news
High Court Of AP
-
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నియంతృత్వ పోకడకు సిద్ధమవుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, భావ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్‌బుక్ పేరుతో అరాచకపు పాలన సాగిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సర్కారు సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తోంది. రెడ్‌బుక్ సృష్టికర్త, మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ సార్థ్యలోనే ఈ కమిటీ పని చేయబోతుండడం ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. మంత్రుల కమిటీ బాధ్యతల ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్‌బుక్‌తో భయపెట్టడానికి చేసిన యత్నం విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త అంకానికి తెరతీసినట్లు అర్థబవుతుంది. తమ దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై వైఎస్సార్సీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై 15 నెలల్లో 2300 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు రాష్ట్రంలోను, వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని, తద్వారా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై నిరంతరం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుఎ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌తోపాటు విదేశాల్లోనూ ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్న లోకేశ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది? వాటికి ఉండే పవిత్రత ఏమిటి? సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతమున్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగబడడమేమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్లు ఎలా మారుస్తారు? అని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పోన్నవోలు సుధాకరరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాతో పాటు, తన వైఫల్యాలను పదే, పదే గుర్తు చేసే ప్రదాన మీడియాను ముఖ్యంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతోంది. సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్న తీరు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైనం పై న్యాయ స్థానాలు తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు సవిందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసుల అరాచకపు ప్రవర్తనను తేటతెల్లం చేసింది. హోం మంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు తమ పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడడం లేదని, మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు గురయ్యారు. ఆమె చెప్పిన వారిలో ఒకరైన విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణలు చేయలేదు. ప్రభుత్వం మంచి, చెడులను గణాంకాలతో సహా విశ్లేషిస్తారు. ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోం మంత్రి మాట్లాడడం అందరిని నివ్వెరపరచింది. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప, ఫలానా కులం అని చెప్పడం ఏపాటి విజ్ఞత? అలాగే మరొకరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకుని యూ ట్యూబ్ నడుపుతున్నారని, అతని పేరు ముకేష్ రెడ్డి అని హోం మంత్రి అసెంబ్లీలో చెబితే, ఆ యువకుడు తన ఆధార్ కార్డు చూపి మరీ తాను చలపతి చౌదరినేనని రుజువు చేసుకున్నారు. దాంతో ఈ ప్రభుత్వ డొల్లతనం, మంత్రిగారి తొందరపాటుతనం అన్నీ బయటపడ్డాయి.మంత్రి అనిత చెప్పేది ప్రామాణికం అయితే స్వాతిరెడ్డి అనే పేరుతో సోషల్ మీడియాలో వైసిపిని విమర్శించే ఒకరు చౌదరి అట. పైగా ఆమెను గతంలో చంద్రబాబు అభినందించిన ఘట్టం కూడా జరిగిందట. ఆమె గురించిన సమాచారం అనిత వద్ద లేదా? లేక ఆమె తమ పార్టీ కనుక వదలి వేశారా అని కొందరు ప్రశ్నించారు. ఇక జగన్ ను ఉద్దేశించి మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడేది అందరికి తెలిసిందే. అంతేకాదు. గతంలో ఈ మంత్రిగారు జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చట్టసమ్మతమేనా అని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మంత్రిగారు కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇక ప్రభుత్వ పెద్దలు నిత్యం అబద్దాలు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన దారుణ వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని లోకేశ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా? గతంలో పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ చేసిన దారుణమైన అబద్దపు ప్రచారంపై ఈ కమిటీ ఏమైనా విశ్లేషిస్తుందా! సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యతిరేక ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని చూస్తున్న ఈ కమిటీ ప్రభుత్వంలో అబద్దాలు ఆడే వారిపై కూడా కేసులు పెట్టవచ్చని సిఫారస్ చేయగలుగుతుందా? అప్పుడు ఈ కమిటీకి విలువ వస్తుంది.కాని అలా చేయలేరు. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత దుష్ప్రచారం చేసింది చంద్రబాబు, లోకేశ్ లకు తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియకపోవచ్చు. దానిని ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం, ఇప్పుడు ఈ కమిటీ ప్రయత్నిస్తుందన్న విమర్శ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది.వాటిని ఎపి పోలీసులు సరిగా పాటించడం లేదు. ఏడేళ్ల శిక్షకు అవకాశం ఉన్న సోషల్ మీడియా కేసులలో నోటీసు ఇచ్చి పంపాలి. అలా చేయడం ఇష్టం లేని రెడ్‌బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న పోలీసులు పలు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ కమిటీ అలాంటి పోలీసులపై చర్య తీసుకోవడానికి సిఫారస్ చేస్తుందా? ఈ కమిటీ జవాబుదారితనం గురించి ఆలోచిస్తుందట. ముందుగా ప్రభుత్వంలో ఉన్నవారి జవాబుదారితనం గురించి ఈ కమిటీ చర్చించి, నిర్ణయాలు చేసి, అప్పుడు సోషల్ మీడియావారి జోలికి వెళితే మంచిది కదా! అంతర్జాతీయ ఉత్తమ పద్దతులను అధ్యయనం చేస్తారట. అదేమిటో తెలియదు. హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలలో ఎలా స్పందించాలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై అప్రమత్తంగానే ఉంటుంది. అయినా ఆ పేరుతో పద్దతిగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలన్న ఉద్దేశం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పౌరహక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలన్నది ఈ కమిటీ బాధ్యతట. అదే నిజమైతే ప్రభుత్వం ఇంతవరకు అక్రమంగా అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులన్నిటీని సమీక్షించి, అన్యాయంగా అరెస్టు అయినవారిని విడుదల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఈ కమిటీకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను పెట్టాలట. అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల బెదిరింపులు చాలవన్నట్లుగా కొత్తగా కొన్ని సంస్థలను సృష్టించి వారికి కోట్ల రూపాయలు చెల్లించి సోషల్ మీడియా వారిని బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారన్న డౌటు రావడం లేదా? ఇదంతా మీడియా గొంతు నొక్కడమేనని వైఎస్సార్సీపీ అభిప్రాయపడింది. ఈ కమిటీలో బీజేపీ నుంచి మంత్రి సత్య ప్రసాద్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి పార్థసారథి కూడాఉన్నప్పటికీ, అంతిమంగా లోకేశ్ ఏమి డిక్టేట్ చేస్తే అది ఫైనల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి తమ రాష్ట్రంలో రెడ్ లేదా పింక్, లేదా బ్లూ బుక్ లు ఏవీ ఉండవని, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని, అది చట్టాల ప్రకారమే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు, ఏపీలో రెడ్ బుక్ అరాచకపు పాలనకు చెంపపెట్టు అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలదా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం
-
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, తన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ అసభ్యంగా పోస్టులు పెట్టిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన రిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్‌గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు.తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ అంబటి ప్రశ్నించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
పోసాని క్వాష్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 35(3) నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. మొన్న విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం, పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
పోసాని కృష్ణమురళికి మరో ఊరట
అమరావతి, సాక్షి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో మరో ఊరట దక్కింది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సూర్యారావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టు(AP high Court)లో పోసాని క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం వాదనలు విన్న హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. తాజాగా.. ఇవాళ పోసానిని అరెస్ట్ చేయొద్దంటూ విజయవాడ సూర్యారావు పేట పోలీసులను ఆదేశించింది. పోసాని తరఫున ఇవాళ వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.హైదరాబాద్ టు కర్నూల్ జైలు.. ఎప్పుడు.. ఏం జరిగిందంటే..ఫిబ్రవరి 24న.. పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి నేతలను పోసాని గతంలో దూషించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు నమోదుఫిబ్రవరి 27న.. హైదరాబాద్‌లోని తన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినని పోలీసులు.. అదే రాత్రి తరలింపుఫిబ్రవరి 28న.. ఒబులవారిపల్లి పీఎస్‌కు తరలింపు.. సుదీర్ఘ విచారణ.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోసానిఫిబ్రవరి 28న.. రైల్వే కోడూరులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధింపుమార్చి1న.. ప్రిజనర్ ట్రాన్సిట్(PT) వారెంట్ కింద అదుపులోకి తీసుకున్న పల్నాడు నరసరావుపేట టూటౌన్ పోలీసులుమార్చి3న.. నరసరావుపేట కోర్టులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు. పోసానికి జ్యూడీషియల్ రిమాండ్ విధించిన జడ్జిమార్చి3న.. పీటీ వారెంట్ జారీ చేసిన కర్నూల్ జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు. మార్చి4న.. నరసరావుపేట నుంచి ఆదోని పీఎస్‌కు పోసాని తరలింపు మార్చి 5న.. మెజిస్ట్రేట్ నివాసంలో పోసానిని ప్రవేశపెట్టిన ఆదోని త్రీటౌన్ పోలీసులు.. రిమాండ్ మీద కర్నూల్ జైలుకు తరలించారుమార్చి6న.. ఆదోని కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విచారణ.. కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్మార్చి7న.. కర్నూలు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ విచారణకౌంటర్ వేయనున్న ఆదోని పోలీసులుఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కర్నూలు కోర్టులో తీర్పు వెలువడే అవకాశం -
ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ఊరట దక్కింది.వైవీ విక్రాంత్ రెడ్డికి ఊరటమరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డి(YV Vikrant Reddy)కి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ మంజూరు అయ్యింది. -
శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: సినీనటి మల్లిడి విమల అలియాస్ శ్రీరెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. విశాఖ నాల్గో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆమెకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వారంలో ఒక రోజు సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలంది. అలాగే కర్నూలు, గుడివాడ, నెల్లిమర్ల తదితర పోలీస్స్టేషన్లలో శ్రీరెడ్డిపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల ఆమె విషయంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలనుద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు న మోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. శ్రీరెడ్డిపై చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, అందువల్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచా రణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనకాపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
వాహనదారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,గుంటూరు:కేంద్ర మోటార్ వాహనాల సవరణ చట్ట నిబంధనలను సరిగా అమలు చేయట్లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం(డిసెంబర్ 18) విచారణ జరిగింది. చట్ట నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిబంధనలు ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎక్కడికక్కడే వాహనాలను ఆపి జరిమానా విధించండి. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే.99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారు. జరిమానా కట్టకుంటే వాహనాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు. వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించింది. విపరీతమైన వేగం,హారన్లతో నరకం చూపిస్తున్నారు. హైబీమ్ తో ఎంతోమంది చనిపోతున్నారు. హైబీమ్ వాడినందుకు జరిమానా ఎందుకు కట్టరు. చట్ట నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే.ఇందుకు ఏం చేస్తున్నారో చెప్పండి.పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి’ అని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు నిబంధనలు అమలు చేసి ఉంటే ఈ నాలుగు నెలల్లో మృతి చెందిన 677 మందిలో కొందరైనా బతికి ఉండే వాళ్లని హైకోర్టు వ్యాఖ్యానించింది.తదుపరి విచారణ జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
AP: వర్రా రవీంద్రారెడ్డి పిటిషన్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 20) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.చట్టనిబంధనలు,కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆదేశించింది.పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.హైకోర్టులో వర్రా రవీంద్రారెడ్డి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు..ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించిందిఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలినిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పు ఇచ్చిందివర్రా రవీంద్రారెడ్డి రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారుకోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారురవీంద్రారెడ్డి హైకోర్టు ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరు పరిచారు24 గంటల్లో వర్రా రవీంద్రారెడ్డి రెడ్డిని కోర్టులో హాజరపరచాల్సిన పోలీసులు 48 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారురాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఇలానే వ్యవహరిస్తున్నారుచట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్న హెచ్చరికలు పోలీసులకు పంపాల్సిన సమయం ఆసన్నమైందిరాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారుఅధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారుఇవేవీ పోలీసులకు కనిపించడం లేదువారి జోలికి వెళ్లే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదుకొంతమంది పోలీసులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం -
ఏపీ హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన


