గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే క్యాంప్‌ ఆఫీస్‌ కాల్చివేత | greenfield highway camp office set ablaze : ysr district | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే క్యాంప్‌ ఆఫీస్‌ కాల్చివేత

Jul 7 2024 5:27 AM | Updated on Jul 7 2024 5:27 AM

greenfield highway camp office set ablaze : ysr district

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నేతల దుశ్చర్య

కాంట్రాక్టు పనులు అప్పజెప్పనందుకే..

రూ. 30 లక్షల మేర నష్టం

వేముల: వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే క్యాంప్‌ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.

రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్‌ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement