Arson
-
లండన్‌లో మత విద్వేష ఘటన
లండన్: బ్రిటన్‌లోని ఉత్తర లండన్‌లో సోమవారం తెల్లవారుజామున యూదు వ్యతిరేక దాడితో స్థానికంగా ఒక్కసారిగా కలకలంరేగింది. ‘హ్యాట్జోలా నార్త్‌వెస్ట్’ అనే లాభాపేక్షలేని యూదుల సేవా సంస్థకు చెందిన ఒకేచోట పార్క్చేసిన నాలుగు అంబులెన్సులను ‘గోల్డన్స్ గ్రీన్’ ప్రాంతంలోని హైఫీల్డ్ రోడ్డులో గుర్తుతెలియని ఆగంతకులు తగలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఈ దాడి ఘటన జరిగింది. అంబులెన్సుల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. సమీప నివాస భవన అద్దాల కిటికీలు బద్ధలయ్యాయి. విషయం తెల్సి వెంటనే ఉగ్రవ్యతిరేక పోలీస్ విభాగం రంగంలోకి దిగి నిందితుల కోసం వేట మొదలెట్టింది. ‘‘ఘటనతో ముగ్గురికి ప్రమేయం ఉందని భావిస్తున్నాం. త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం’’ అని పోలీస్ సూపరింటెండెంట్ సారా జాక్సన్ తెలిపారు. అంబులెన్సులను దహించివేస్తున్న అగ్నికీలలను ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. 40 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ కాల్చివేత
వేముల: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
భారీగా చెలరేగిన మంటలు: 42 మంది ఆహుతి
అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf — sebastian usher (@sebusher) August 10, 2021 the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s — ♠️ (@cicegimeda) August 10, 2021 Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF — Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021 -
పెట్రోల్‌తో భార్యకు నిప్పంటించి..
కరీమాబాద్ : ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చనే అవగాహన కరువై క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా నిండు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతుండగా, పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇటీవల వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఆవరణలో లేబర్ కాలనీకి చెందిన హరికృష్ణ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆవేదనతో ఆయన ఆత్మహత్యాయత్యానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను మరువకముందే వరంగల్ 23వ డివిజన్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో సోమవారం అర్ధరాత్రి బండి భాస్కర్(40) భార్య విజయ(36) సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం కలహాల కారణంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆయన భార్య విజయను గట్టిగా పట్టుకుని ఆమెపై కూడా పెట్రోల్ పోయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతో... ఆటోలో తిరుగుతూ బట్టలు అమ్ముకునే బండి భాస్కర్, బీడీ కార్మికురాలైన విజయ దంపతుల నడుమ రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే విజయ భర్త దగ్గరి నుంచి తన బంధువుల ఇంటికి వెళ్లడాన్ని సహించలేకపోయిన భాస్కర్ ఈ ఘాతునికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాను మాత్రమే చనిపోవద్దని నిర్ణయించుకున్న ఆయన పథకం ప్రకారమే భార్య వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇద్దరూ కన్నుమూశారు. ఈక్రమంలో అడ్డుకోవడానికి వచ్చిన వారిని భాస్కర్ బెదిరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా వీరి మృతితో పధ్నాలుగేళ్ల కుమారుడు అశ్విత్ ఇప్పుడు అనాథలగా మారాడు. ఈ ఘటనపై విజయ తండ్రి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రవికిరణ్ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి : (తండ్రి ప్రాణం తీసి.. టవల్‌తో ఉరివేసి) (బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి..) -
అధికారంలోకి రాగానే తుని కేసులు ఎత్తేస్తాం
-
పాదముద్రలు పట్టించేనా?
తాడేపల్లి రూరల్/సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణ గ్రామాల్లో జరిగిన దహనకాండపై పోలీసుల క్లూస్ టీం మంగళవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. సంఘటన స్థలంలో లభ్యమైన పాదముద్రల ఆధారంగా వివరాల సేకరణకు నడుంకట్టారు. తాడేపల్లిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, గతంలో ఉండవల్లి, పెనుమాక పంచాయతీల పరిధిలో చిన్నచిన్న గొడవల్లో తలదూర్చిన యువకులను, వీరితో పాటు రైతులను సైతం తాడేపల్లి పోలీసుస్టేషనుకు పిలిపించారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్ర ఆధారంగా, దానికి సరిపోలి ఉండే వారి పాదముద్రలు సేకరించారు. ఎందుకు పిలిపించారో తెలియక రైతులు ఒకింత అసహనానికి గురయ్యారు. రౌడీషీటర్లతోపాటు తమ పాదముద్రలు కూడా సేకరించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా విచారణ పేరుతో ప్రతిరోజూ ఇలా పోలీసుస్టేషనుకు పిలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఇలా ప్రతిరోజూ స్టేషనుకు పిలిపించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే తమకు చావు తప్ప వేరేమార్గం లేదంటున్నారు. మూడు రోజుల క్రితం పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సంఘటనలో తాను పాల్గొన్నట్టు తెలిపి చివరకు పోలీసులను అయోమయానికి గురిచేశాడు. అతను అబద్ధాలు చె్డపుతున్నట్టు తేలడంతో తిరిగి విచారణ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కొందరిని పిలిపించిన పోలీసులు వారు చెప్పిన ఆధారాల ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన నిపుణులతో ఇద్దరు నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలు సిద్ధం చేశారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై ఆగని పోలీసుల వేధింపులు... దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులు పలువురు అనుమానితులను స్టేషన్లకు పిలిచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అనేక మంది వైఎస్సార్సీపీ వర్గీయులను విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ వర్గీయుల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ సీపీకి సంబంధించిన వారినే టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్స్టేషన్లలో కూర్చోబెడుతుండటంతో గ్రామాల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మాని విచారణ పారదర్శకంగా జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దహన కాండకు పాల్పడిన ఆ ఇద్దరూ ఎవరు..? రాజధాని ప్రాంతంలోని పొలాల్లో దహన కాండకు పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని మొదటి నుంచి పోలీసులు చెబుతున్నప్పటికీ ఆ ఇద్దరూ ఎవరనేది తేలడంలేదు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం చూసినా ఇద్దరు వ్యక్తులే ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు మాత్రం పక్కా పథకం ప్రకారం సెల్‌ఫోన్, వాహనాలు వినియోగించకుండా జాగ్రత్తపడినట్లు అర్థమవుతోంది. ఈ కేసులో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.


