మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతి | Former Minister Koppana Mohan Rao Passed Away In East Godavari | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కొప్పన మోహనరావు కన్నుమూత

Jul 30 2020 7:59 AM | Updated on Jul 30 2020 1:33 PM

Former Minister Koppana Mohan Rao Passed Away In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్‌సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహనరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement