సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీపై అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.


