పేర్నినానికి అరెస్టు వారెంట్‌ జారీ అంటూ తప్పుడు ప్రచారం.. | False Propaganda Against Former Minister Perni Nani | Sakshi
Sakshi News home page

పేర్నినానికి అరెస్టు వారెంట్‌ జారీ అంటూ తప్పుడు ప్రచారం..

Jun 16 2025 9:09 PM | Updated on Jun 16 2025 9:09 PM

False Propaganda Against Former Minister Perni Nani

సాక్షి,కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి దిగింది. 2019 నాటి కేసులో పేర్నినానికి మచిలీపట్నం కోర్టు ఆరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.  

కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైంది. ఓ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేర్నినానిని..మరుసటి వాయిదాకు హాజరవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఏముందో చూడకుండా అరెస్ట్ వారెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఎల్లోమీడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement