మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్ట్‌ | Ex MP Kesineni Nani Makes Another Sensational Post On TDP MP Chinni | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్ట్‌

Jun 28 2026 9:27 AM | Updated on Jun 28 2026 11:06 AM

Ex MP Kesineni Nani Makes Another Sensational Post On TDP MP Chinni

సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్టు పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భూ కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్‌కి లేఖ రాశారు. హైదరాబాద్‌లోని ప్రగతి నగర్, షంషిగూడలో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని కోరారు.

ఈడీ జప్తు ఆదేశాలు, ఎన్‌సీఎల్‌టీ ఆంక్షల విషయాన్ని దాచిపెట్టారు. ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఏమాత్రం లేవు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అఫిడవిట్ స్పష్టం చేసినప్పటికీ అక్కడ ఆక్రమణలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎంవో అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలి. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాను రంగంలోకి దించాలి. బాధ్యులపై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి’’ అని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement