డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా | ECI Appoints Harish Kumar Gupta As New DGP Of AP, Replaces KV Rajendranath Reddy | Sakshi
Sakshi News home page

డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

May 7 2024 5:16 AM | Updated on May 7 2024 11:47 AM

ECI appoints Harish Kumar Gupta as new DGP of AP

అనంతపురం డీఐజీ ఆర్‌ఎస్‌ అమ్మిరెడ్డి బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)గా హరీష్ కుమార్‌ గుప్తా సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్‌ కలిగిన అధికారుల పేర్లను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ద్వారకా తిరుమలరావు, హరీష్‌కుమార్‌ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్‌ పేర్లను సీఎస్‌ పంపించగా.. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నిక సంఘం హరీష్ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది. కాగా, అనంతపురం డీఐజీ ఆర్‌ఎస్‌ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement