కనికరమే లేదు | disabled people faced by differently in new pensions | Sakshi
Sakshi News home page

కనికరమే లేదు

Sep 22 2026 5:21 AM | Updated on Sep 22 2026 5:22 AM

disabled people faced by differently in new pensions

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో బారులు తీరిన పింఛన్ల దరఖాస్తుదారులు

పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల అవస్థలు.. 27 నెలల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశమిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు 9 రోజులే గడువు 

తక్కువ సమయం కావడంతో ధ్రువపత్రాలు సమకూర్చుకోలేకపోయిన అర్జీదారులు

పీజీఆర్‌ఎస్‌కు వచ్చి అధికారులను వేడుకొన్న అర్జీదారులు

సాక్షి, నెట్‌వర్క్‌: ఆపన్నులను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు లేకపోతే ఆ సర్కారు తీరు ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుకు నోచుకోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను చూస్తే తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకొని, పింఛన్లు ఇప్పించేవారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే పింఛన్లకు కొత్త దరఖాస్తులు తీసుకోవడం మానేసింది. ఎక్కడా దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా చేసింది. దీంతో పింఛనుకు అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

 27 నెలల తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులకు అనుమతించిన ప్రభుత్వం.. కేవలం 9 రోజులే గడువిచి్చంది. దీంతో వేలాది మంది ధ్రువపత్రాలు సమకూర్చుకోలేక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. మరికొందరు ఆన్‌లైన్‌లో ఎంత ప్రయత్నించినా దరఖాస్తు తీసుకోలేదు. దీంతో చివరి ప్రయత్నంగా సోమవారం జిల్లాల్లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు తమ వేదన విన్నవించేందుకు దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తరలివచ్చారు. ఇలా అధికారులకు తమ గోడును వెళ్లబోసుకొని, పింఛను ఇప్పించాలని వేడుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement