breaking news
differently-abled children
-
కనికరమే లేదు
సాక్షి, నెట్వర్క్: ఆపన్నులను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు లేకపోతే ఆ సర్కారు తీరు ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుకు నోచుకోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను చూస్తే తెలుస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకొని, పింఛన్లు ఇప్పించేవారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే పింఛన్లకు కొత్త దరఖాస్తులు తీసుకోవడం మానేసింది. ఎక్కడా దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా చేసింది. దీంతో పింఛనుకు అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 27 నెలల తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులకు అనుమతించిన ప్రభుత్వం.. కేవలం 9 రోజులే గడువిచి్చంది. దీంతో వేలాది మంది ధ్రువపత్రాలు సమకూర్చుకోలేక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. మరికొందరు ఆన్లైన్లో ఎంత ప్రయత్నించినా దరఖాస్తు తీసుకోలేదు. దీంతో చివరి ప్రయత్నంగా సోమవారం జిల్లాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో అధికారులకు తమ వేదన విన్నవించేందుకు దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తరలివచ్చారు. ఇలా అధికారులకు తమ గోడును వెళ్లబోసుకొని, పింఛను ఇప్పించాలని వేడుకొన్నారు. -
నటుడి ఇంటి వద్ద పోలీసు భద్రత
కేకే.నగర్(చెన్నై): దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడిన మాట్లాడిన డీఎంకే నేత, నటుడు రాధారవిపై నిరసన జ్వాలలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రాధారవి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మింట్లో ఇటీవల జరిగిన డీఎంకే బహిరంగ సమావేశంలో నటుడు రాధారవి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనాంపేటలో గల రాధారవి ఇంటిని ముట్టడించి పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు రాధాకృష్ణన్ ప్రకటించాడు. దీంతో రాధారవి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. దీనిపై రాధారవి మాట్లాడుతూ తాను దివ్యాంగుల మనసు బాధించేలా మాట్లాడలేదని తెలిపారు. కనిమొళి ఖండన రాధారవి మాటలను డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి కనిమొళి తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ దివ్యాంగులను కించపరిచి వారి మనసులు బాధించే విధంగా రాధారవి మాట్లాడడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇకనైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హితవు చెప్పారు.


