Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd of Devotees Increased in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Feb 9 2025 9:02 AM | Updated on Feb 9 2025 10:42 AM

Crowd of Devotees Increased in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 76,598 మంది స్వామిని దర్శించుకున్నారు.35,334 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.46  కోట్లు సమర్పించారు. 

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement