Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd of Devotees Increased in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 15 2024 8:16 AM | Updated on Dec 15 2024 9:19 AM

Crowd of Devotees Increased in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. క్యూకాంప్లెక్స్‌లో 22  కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 72,962మంది స్వామిని దర్శించుకున్నారు.30,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37  కోట్లు సమర్పించారు. 

టైంస్లాట్‌ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement