
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దాదాపు 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, దాడి ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా, రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పథకం ప్రకారమే పోలీసులపై దాడికి దిగారు. టీడీపీ అల్లరి మూకలు విచ్చక్షణరహితంగా దాడి చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ ఎడమ కంటి చూపు పోయింది. ఆరోజు జరిగిన దాడి ఘటనలో మరో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటామన్నారు. రణధీర్‌కు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు.
మరోవైపు.. పుంగనూరు ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశాడు. రూట్ మ్యాప్ ప్రకారం కాదని, పుంగనూరులోకి వెళ్లి పోలీసులపై దాడి చేశారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. అల్లరి మూకల దాడిలో కానిస్టేబుల్ రణధీర్ కన్ను కోల్పాయడు. మదనపల్లి నుంచి చల్లా బాబు, చంద్రబాబు ఒకే కారులో ప్రయాణిస్తూ దాడికి పథకం రచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిందలు వేయడానికే ముందస్తు ప్రణాళికతో దాడులు చేశారు. పోలీసులు కాల్పులు జరపకుండా సంయమనం పాటించారు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా చేర్చాలి. నారా లోకేశ్ వార్డు సభ్యుడిగా కూడా గెలవని వ్యక్తి అని పొలిటికల్ పంచ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఈ దారుణానికి బాధ్యులెవరు?