CM Jagan: వైఎస్సార్‌ జిల్లాలో ముగిసిన పర్యటన | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

Published Fri, Nov 10 2023 9:05 AM

CM YS Jagan YSR Kadapa District Tour Updates - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయ  ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75  కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను సీఎం జగన్‌ ప్రారంభించారు.

అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డీఐజీ శెంథిల్ కుమార్, ఎస్పీ శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ గంగ రత్నమ్మ, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపిపి లక్ష్మీ గాయత్రి, ఇడుపులపాయ సర్పంచ్‌ నాగమ్మ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

అనంతరం ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సమీక్షలో భాగంగా.. వేముల మండలం ప్రజాప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా రెండు రోజుల పర్యటన ముగిసింది. గురు, శుక్రవారాల్లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. ఇడుపులపాయ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.

ఇదీ చదవండి: పులివెందులో సీఎం జగన్‌ చేతుల మీదుగా రూ. 64.54 కోట్ల పనులు

Advertisement
 
Advertisement
 
Advertisement