పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ

Published Wed, May 15 2024 12:22 PM

CM YS Jagan Reacts Over Palnadu Bus Accident

సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్‌ చెప్పారు. 

కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ​కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవ​ర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్‌లో ఉన్న సమయంలో టిప్పర్‌ను ఢీకొట్టింది.

Advertisement
Advertisement