CM Jagan Approves Transfer of Village Ward Secretariat Employees - Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బదిలీలకు సీఎం జగన్‌ ఆమోదం

May 25 2023 8:55 PM | Updated on May 25 2023 9:02 PM

Cm Jagan Approves Transfer Of Village Ward Secretariat Employees - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు.  జిల్లా  పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు.

జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: సీఎం జగన్‌ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement