
ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు పంపడం వెనుక కుట్ర ఇదీ
సాధారణ వ్యాపార లావాదేవీ వక్రీకరణ
పూర్తి ఆధారాలు సమర్పించిన పీఎల్‌ఆర్ కంపెనీ
అయినా పదే పదే అదే అభియోగంతో ముందుకెళ్లిన సిట్
మరో వైపు రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వైపు కన్నెత్తి చూడని వైనం
చంద్రబాబు డైరెక్షన్‌లో సిట్ ద్వంద్వ వైఖరి..
కక్ష సాధింపునకు ఇదే నిదర్శనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్‌ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.
కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్‌ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్‌ఆర్ కంపెనీ సమరి్పంచింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.
అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యతి్నంచింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్‌ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది.
ఇదీ అసలు వాస్తవం
అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరు?
⇒ ఈ అక్రమ కేసు కుట్రలో చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి అనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. మంత్రి లోకేశ్‌కు బినామీగా పేరుపడిన ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార వ్యవహారాలపై అందుకే సిట్ దృష్టి సారించడం లేదు.
⇒ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ఫ్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ.. హైదరాబాద్‌లోని ఒకే చిరునామా (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి.
⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ( ్చఛిఛిౌun్టటఃఠీటజ్చిnఠిజీజీnజట్చpట్జౌ్ఛఛ్టిట. ఛిౌఝ)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని.. మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యం. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేశారు.
⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్ బండారం బట్టబయలవుతుంది. రాజ్ కేసిరెడ్డితోపాటు ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులపై సిట్ నమోదు చేసింది అక్రమ కేసేనన్నది బయట పడుతుంది. ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు మొత్తం కుట్ర బహిర్గతమవుతుంది.