సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జల్లికట్టు పోటీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఊర్ల ఓబనపల్లిలో టీడీపీ నేతల కనుసన్నల్లో పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోటీల పేరుతో మూగజీవాలను చిత్రవదకు గురిచేస్తున్నారు. ఈ సందర్బంగా పోటీలలో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీలలో పాల్గొన్న ఎద్దు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. అనంతరం క్రీడలో పాల్గొన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.



