ముగిసిన ఆర్టీసీ భేటీ.. వీడని సందిగ్ధత | APSRTC, TSRTC Officers Meeting Completed In Hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆర్టీసీ సమావేశం.. వీడని సందిగ్ధత

Oct 7 2020 8:11 PM | Updated on Oct 7 2020 8:46 PM

APSRTC, TSRTC Officers Meeting Completed In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ అవ్వగా.. 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. చదవండి: ఆర్టీసీ సిబ్బంది విభజనలో ‘సుప్రీం’ స్టే

అయితే తాజాగా తాము లక్ష 61 వేల కిలోమీటర్ల నడుపుకుంటామని మీరు(ఏపీ) కూడా లక్ష 61వేల కిలోమీటర్లు నడుపుకొండని టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏపీ ఆర్టీసీ అధికారులకు సూచించారు. దీనిపై ఆలోచించిన ఏపీ అధికారులు మరోసారి నిర్ణయం తీసుకొని భేటీ అవుతామని చెప్పారు. కాగా దసరా పండక్కి బస్సులపై తెలంగాణ అధికారులకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. చదవండి: మరోమారు చర్చలు.. బస్సులు నడిచేనా?

Advertisement
 
Advertisement
Advertisement