కొత్త కరోనా: ఏపీ సర్కార్‌ అప్రమత్తం | AP Government Alerted Due To New Corona | Sakshi
Sakshi News home page

కొత్త కరోనా: ఏపీ సర్కార్‌ అప్రమత్తం

Dec 22 2020 8:29 PM | Updated on Dec 22 2020 8:39 PM

AP Government Alerted Due To New Corona - Sakshi

సాక్షి, అమరావతి: బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త రకం వైరస్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. పాజిటివ్ పేషెంట్లను కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. నెగిటివ్ వచ్చిన వారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని, ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన వారి వివరాల సేకరణ పనిలో అధికారులు ఉన్నారు. (చదవండి: ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు)

Advertisement
 
Advertisement
Advertisement