టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ను సోదరుడిగా సంభోదిస్తూ.. మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలతో పాటు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. "సోదరుడు, తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ అన్ని ప్రయత్నాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని జగన్ పేర్కొన్నారు. రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో విజయ్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.@TVKVijayHQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2026
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే విజయ్‌కు అగ్రనటుడిగా, ప్రస్తుతం రాజకీయ నేతగా కూడా విశేష ఆదరణ ఉంది. వీళ్లిద్దరూ ఆ మధ్య ఓ వివాహ వేడుకలో కలిసి సందడి చేశారు. అలాగే.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ విజయ్ వైఎస్ జగన్ ఫొటోను ప్రదర్శించడమూ విపరీతంగా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో జగన్ చేసిన బర్త్‌డే ట్వీట్‌కు అటు విజయ్ అభిమానులు, ఇటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇద్దరు నేతల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తూ ఈ సందేశాన్ని వైరల్ చేస్తున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


