మార్గదర్శి కేసు: ఈనెల 6న శైలజాకిరణ్‌ను విచారించనున్న సీఐడీ | AP CID Will Interrogate Sailaja Kiran On June 6th In Margadarsi Case | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసు: ఈనెల 6న శైలజాకిరణ్‌ను విచారించనున్న సీఐడీ

Jun 1 2023 9:10 AM | Updated on Jun 1 2023 3:38 PM

AP CID Will Interrogate Sailaja Kiran On June 6th In Margadarsi Case - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఆ నోటీసులపై సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజాకిరణ్‌ను ఇప్పటికే సీఐడీ హైదరాబాద్‌లో వారి నివాసంలో వేర్వేరుగా విచారించింది. ఈ కేసులో మరోసారి విచారించాల్సి ఉంటుందని ఆమెకు సీఐడీ విభాగం ఇటీవల సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లో ఆమె అందుబాటులో ఉండే తేదీలు తెలపాలని సూచించింది కూడా. జూన్‌ 3 తరువాత తాను విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సీఐడీకి తెలిపారు. 

దీంతో జూన్‌ 6న హైదరాబాద్‌లో శైలజాకిరణ్‌ నివాసంలోనే ఆమెను విచారిస్తామని సీఐడీ నోటీసులిచ్చింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆమెగానీ ఆమె తరఫు న్యాయవాదులుగానీ సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఇటీవల ఆమెపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆమె విమానాశ్రయానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement