బతికున్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా అవస్థలేనా? | Amalapuram Bridge Issue Dead Body Carried On Temporary Bridge | Sakshi
Sakshi News home page

బతికున్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా అవస్థలేనా?

Oct 6 2026 10:30 PM | Updated on Oct 6 2026 10:30 PM

Amalapuram Bridge Issue Dead Body Carried On Temporary Bridge

సాక్షి ఆంధ్రప్రదేశ్‌: మనిషి ఆఖరి ప్రయాణం కూడా సాఫీగా సాగని దుస్థితి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వంతెన పనులు పూర్తికాకపోవడంతో మృతదేహాన్ని ప్రమాదకరంగా ఉన్న తాత్కాలిక వంతెనపై నుంచి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి వీరయ్యపేటలో చోటుచేసుకుంది.

గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంతో స్థానికులు కొబ్బరి తోపులతో తాత్కాలికంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. ఇదే ప్రమాదకర మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే తాత్కాలిక వంతెనపై నుంచి మృతదేహాన్ని మోసుకెళ్లారు.

బతికున్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా అవస్థలేనా? అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆఖరి ప్రయాణమైనా గౌరవంగా సాగించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి, తమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి కేసు : నిందితుడిపై  కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement