కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి | Adapa Seshu's Response To The Attacks On The Community | Sakshi
Sakshi News home page

కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి

Jun 23 2026 1:47 PM | Updated on Jun 23 2026 2:43 PM

Adapa Seshu's Response To The Attacks On The Community

కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబివ్వాలని కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు డిమాండ్‌ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌తో పాటు క్రాంతికుమార్‌ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలన్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్‌కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై పిచ్చి కూతలు కూసిన పంతం నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ కాపు కార్పొరేషన్‌ గురించి మాట్లాడే ముందు.. రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ హయాంలో కాపు నేస్తం సహా వివిధ పథకాల ద్వారా రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement