వాలీబాల్‌ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగు | 11 people were injured by lightning | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ ఆడుతుండగా వర్షం.. అంతా ఒక చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగుపడటంతో..

Jul 3 2023 3:48 AM | Updated on Jul 3 2023 8:37 AM

11 people were injured by lightning - Sakshi

రావికమతం (అనకాపల్లి జిల్లా): చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 11 మంది గిరిజన యువకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు, 8 మందిని 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రావికమతం మండలం తాటిపర్తి గిరిజన గ్రామంలో ఆ గ్రామానికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, షోమీల శ్రీను, పాడి చినబ్బాయి, బాలకృష్ణ, లోత కళ్యాణం, సుర్ల గణేష్‌ తదితర యువకులు ఆదివారం వాలీబాల్‌ ఆడుతుండగా వర్షం రావడంతో అంతా ఒక చెట్టు కిందకు పరుగులు తీశారు.

ఆ సమయంలో వారికి సమీపంలోని మరో చెట్టుపై పిడుగుపడడంతో ఆ అదురుకు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న మరికొంత మంది వెంటనే 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని గ్రామ సర్పంచ్‌ వంజరి గంగరాజు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement