‘ఊరు బాగుండాలి.. అందులో మనం ఉండాలి’. అనేది ఆ గ్రామ ప్రజల ఆకాంక్ష. అందరిదీ ఒకే మాట.. ఒకే బాట. పంతాలకు స్వస్తి పలికి ఏకతాటిపై నడుస్తున్నారు. పార్టీలకతీతంగా గ్రామంలో ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌ను ఎన్నుకుంటూ ప్రభుత్వం మంజూరు చే | - | Sakshi
Sakshi News home page

‘ఊరు బాగుండాలి.. అందులో మనం ఉండాలి’. అనేది ఆ గ్రామ ప్రజల ఆకాంక్ష. అందరిదీ ఒకే మాట.. ఒకే బాట. పంతాలకు స్వస్తి పలికి ఏకతాటిపై నడుస్తున్నారు. పార్టీలకతీతంగా గ్రామంలో ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌ను ఎన్నుకుంటూ ప్రభుత్వం మంజూరు చే

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

సింగానహళ్లి గ్రామం ఏరియల్‌ వ్యూ

బొమ్మనహాళ్‌: సింగానహళ్లి గ్రామపంచాయతీ 1932లో ఏర్పడింది. ప్రస్తుతం 500 కుటుంబాలకు పైగా ఉన్న పంచాయతీ పరిధిలో 3,248 మంది జనాభా, 1,162 మంది ఓటర్లు ఉన్నారు. 325 కుటుంబాలు బీసీలే ఉండటం గమనార్హం. ఎనిమిది వార్డులు ఉన్న ఈ పంచాయతీలో ఇప్పటి వరకు ప్రజలు ఒకసారి మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. గ్రామస్తులందరూ ఒకే మాటకు కట్టుబడి ‘ఏకగ్రీవ మంత్రం’తో ముందుకు సాగుతున్నారు. 12 సార్లు ఏకగ్రీవంగా సర్పంచును ఎన్నుకున్నారు. అందుకే ఈ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికలు వస్తే అందరూ ఏకమవుతారు. రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టి ఓ నిర్ణయానికి వస్తారు. ఊరికి మంచి చేసే వ్యక్తిని ఎంచుకుని ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవిలో కూర్చోబెడతారు.

సర్పంచులుగా పనిచేసిన వారు వీరే..

పంచాయతీ ఏర్పడిన 1932 నుంచి కాలింగ కట్టే బసప్ప వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. 1964–70 వరకు కాలింగ మల్లప్ప, 1971–80 వరకు భీమారెడ్డి, 1981–88 వరకు కాలింగ బసన్న, 1988–93 వరకు కుంటి గంగప్ప, 1993–97 వరకు హరిజన కెంచప్ప, 1997లో హరిజన తిప్పేస్వామి సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. 2003లో మాత్రమే పంచాయతీ ప్రజలు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో నరసమ్మ విజయం సాధించింది. అనంతరం 2008లో దేవన్న, తిప్పేస్వామి, తరువాత 2013లో బడిగే నీలమ్మ, 2021లో కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగీవ్రం కావడంతో ప్రోత్సాహకంగా వచ్చిన డబ్బుతో గ్రామంలో 90 శాతం సీసీ రోడ్లు, తాగునీటి వసతులు, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించారు. అందుకే ఈ పర్యాయం కూడా ఏకగ్రీవ బాటలోనే నడిచేందుకు పంచాయతీ ప్రజలు సన్నద్ధమవుతున్నారు.

సింగానహళ్లి పంచాయతీలో ఏకగ్రీవానికే మొగ్గు

12 సార్లు ఏకగ్రీవం.. ఒకే ఒక్కసారి ఎన్నికలు

ప్రశాంతతకు కేరాఫ్‌గా నిలుస్తున్న గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement