అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు కంప్యూటర్, ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 45 రోజుల వ్యవధి ఉన్న కోర్సులో కస్టమర్ రిలేషన్‌షిప్ – సర్వీస్, కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ (జీఎస్టీ), స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్టైల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఇంటర్ పాస్, డిప్లమా/డిగ్రీ/పీజీ – పాస్/ఫెయిల్ అయ్యి, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు అర్హులని చెప్పారు. శిక్షణలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ల ప్రదానంతోపాటు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వివరాలకు 77807 52418ను సంప్రదించవచ్చన్నారు.
26న జిల్లాస్థాయి పారా అథ్లెట్ల ఎంపిక
అనంతపురం: జిల్లాస్థాయి పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 26న అనంతపురంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో చేపట్టనున్నట్టు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎన్.శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారిని ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న పారా అథ్లెట్లు ఈ నెల 26న ఉదయం 9:30 నుంచి 1 గంట లోపు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆయా ఈవెంట్లలో పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. వివరాలకు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్ప 85009 64473, కార్యదర్శి శ్రీనివాసులు 80741 06154ను సంప్రదించవచ్చని తెలిపారు.
శెభాష్.. సురేష్
● ఇస్రోకు ఎంపికై న చిన్నమట్లగొంది వాసి
శింగనమల: మండలంలోని చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ఆకుల సాయిసురేష్ ఇస్రో పరీక్ష ఫలితాల్లో ఆలిండియా 28వ ర్యాంక్ సాధించినట్టు అతడి తండ్రి సూర్యనారాయణ తెలిపారు. పదో తరగతి వరకు సలకంచెర్వులోని జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుకున్న సురేష్ ఇంటర్ అనంతపురంలో, బీటెక్ ఎస్వీయూలో, ఎం.టెక్ ఎన్‌ఐటీ వరంగల్‌లో చదివాడు. ఇస్రోలోని యంత్రాల తయారీ విభాగంలో ఇంజనీర్‌గా ఎంపికై నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇస్రోలో సురేష్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.


