ఐకమత్యంగా ఉంటే విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

ఐకమత్యంగా ఉంటే విజయం తథ్యం

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

గార్లదిన్నె: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో ముందుకు సాగితే విజయం తథ్యమని ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం మర్తాడు క్రాస్‌లోని టీ కన్వెన్షన్‌ హాల్లో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల్లో హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సర్వే రిపోర్టుల్లో కూడా వచ్చేది మన ప్రభుత్వమేనని తేలిందన్నారు. ఓటమి భయంతోనే కూటమి నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి నేతల కుట్రలను తిప్పికొట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపు నిచ్చారు.

ప్రతి పంచాయతీలో

వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలి

ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేద్దామని నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. అనంతరం ఎంపీటీసీల అభ్యర్థులను ఎంపిక కసరత్తు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి, పంచాయతీరాజ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి, సోషల్‌ మీడియా జిల్లా కార్యదర్శి అట్ల తాతిరెడ్డి, నియోజకవర్గ, మేధావుల ఫోరం అధ్యక్షులు అనిల్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు నాగరాజు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు ఆంజనేయులు, నేతలు చీమల శ్రీనివాసులు, చితంబరరెడ్డి, ఆదినారాయణ, గాంధీ, దేవా, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement