వ్యక్తి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

అనంతపురం సెంట్రల్‌: నగరంలో ఆదర్శకాలనీలో ఓ షెడ్డు సమీపంలో చెట్టు కింద దేవినేని జనార్దన్‌రావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన జనార్దన్‌.. ఈనెల 5న ఇంట్లో గొడవ పడి విజయవాడకు వెళ్తున్నట్లు చెప్పి బయటకెళ్లి, తిరిగి వెళ్లలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వ్యక్తి అనుమానాస్పద మృతి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని నాల్గో పట్టణ సీఐ ఏపీ మస్తాన్‌ తెలిపారు.

పేలవమైన ఆటతీరుతో చతికిలపడిన ‘ఆంధ్ర’

అనంతపురం: కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 ట్రోఫీ క్రి కెట్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పేలవమైన ఆట తీరుతో 242 పరుగులకే చతికిల పడింది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో అనంతపురం క్రీడాగ్రామంలో సోమవారం ఆంధ్ర, జార్ఖండ్‌ జట్ల మధ్య అండర్‌–23 స్టేట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి టి.శ్రీధర్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. టాస్‌ గెలిచిన జార్ఖండ్‌ జట్టు.. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌కు దిగింది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 87.4 ఓవర్లలో 242 పరుగులు సాధించింది. ఆంధ్ర బ్యాటర్లలో జీఎస్పీ తేజ అద్భుతంగా రాణించి, 177 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. వరుణ్‌ సాత్విక్‌ 90 బంతుల్లో 49 పరుగులు, కె. హనీష్‌ వీరారెడ్డి 39 పరుగులు చేశారు. జార్ఖండ్‌ బౌలర్లలో అప్సర్‌ 14 ఓవర్లు వేసి ఐదు మెయిడిన్‌లతో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. యోగీష్‌, అభిషేక్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. వికాస్‌ కుమార్‌ యాదవ్‌, హర్షరాజ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. తొలిరోజు ఆట ముగియడంతో ఆంధ్ర జట్టు 242 పరుగులు సాధించి, తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో రోజు మంగళవారం ఉదయం జార్ఖండ్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది.

‘ఇల్లినాయిస్‌’ వర్సిటీ ప్రతినిధులతో భేటీ

అనంతపురం: అమెరికాలోని ‘ఇల్లినాయిస్‌’ ఉన్నతాధికారులతో జేఎన్‌టీయూఏ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శన రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ,జేఎన్‌టీయూఏ మధ్య సమగ్రమైన, డ్యూయల్‌ డిగ్రీ (ద్విసభ్య డిగ్రీ), దీర్ఘకాలిక విద్యా సంబంధిత భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇల్లినాయిస్‌ ప్రతినిధులు దేబాసిస్‌ దత్త (సీనియర్‌ అడ్వైజర్‌ టు ప్రెసిడెంట్‌, ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ), రంజన్‌ కర్రీ (కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ)లు పాల్గొన్నారు. వీసీ సుదర్శనరావు మాట్లాడుతూ మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకనుగుణంగా సిలబస్‌ను తీర్చిదిద్దాలని, ప్రస్తుత పారిశ్రామిక (ఇండస్ట్రీ) అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, డైరెక్టర్‌ (ఫారిన్‌ అఫైర్స్‌ అండ్‌ అల్యూమిని మేటర్స్‌) ప్రొఫెసర్‌ నాగప్రసాద్‌ నాయుడు, డీఏపీ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement