కుమ్మేసిన వర్షం | - | Sakshi
Sakshi News home page

కుమ్మేసిన వర్షం

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

చెరువును తలపిస్తున్న అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణం

అనంతపురం రామ్‌నగర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వర్షపునీటిలో అవస్థలు

అనంతపురం అగ్రికల్చర్‌: చాన్నాళ్ల తర్వాత సోమవారం వర్షం కుమ్మేసింది. అత్యధికంగా అనంతపురం నగరంలో 40 మి.మీ, రూరల్‌లో 35 మి.మీ వర్షపాతం నమోదైంది. చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రధాన కూడళ్లు, రోడ్లు జలమయం కాగా... డ్రెయినేజీలు పొంగి మురికినీరు ప్రవహించడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఇక రాయదుర్గంలో 30, బుక్కరాయసముద్రంలో 20, బెళుగుప్పలో 15 మి.మీతో పాటు పెద్దపప్పూరు, రాప్తాడు, గార్లదిన్నె, పెద్దవడుగూరు, యల్లనూరు, బ్రహ్మసముద్రం, విడపనకల్లు, కూడేరు, తాడిపత్రి, పామిడి, ఉరవకొండ, శెట్టూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురవడంతో పంటలకు పెద్దగా ఉపయోగపడదని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement