అనంతపురం: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఎంతో మంది త్యాగధనుల స్ఫూర్తితో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశ విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవడానికి కేవలం శాంతియుత మార్గంలోనే ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీని గాంధీజీ చూపిన మార్గంలోనే ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. జగన్ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల ముంగిటకు తెచ్చారని కొనియాడారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధులను స్మరించుకుంటూ.. వారి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. మాజీ మేయర్ వసీం సలీం, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ పారదర్శక – సంక్షేమ పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శప్రాయులన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, పామిడి వీరాంజనేయులు, వీరా రామకృష్ణారెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు కాగజ్‌ఘర్ రిజ్వాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, ఎద్దుల అమర్‌నాథరెడ్డి, కట్టుబడి తానీషా, అనిల్ కుమార్ గౌడ్, రిలాక్స్ నాగరాజు, జావేద్, సాకే అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


