ఇతరులు ఆ గదిలోకి వెళ్లడానికి కూడా సాహసించరు. అంత అధ్వానంగా ఉన్న గదిలోనూ ఉద్యోగులు విధిలేక విధులు నిర్వర్తిసున్నారు. పైకప్పు ఊడుతున్నా ప్రభుత్వ సేవలో కొనసాగుతున్నారు. ఇది ఎక్కడో కాదు... గతేడాది ఐఎస్‌వో సర్టిఫికెట్లు పొందిన అనంతపురం వ్యవసాయశాఖ జేడీఏ కార్యాలయం. కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది. అందులోనూ ఒక గది అయితే మరీ భయంకరంగా ఉండటం గమనార్హం. ప్రమాదకరంగా పైకప్పులు ఊడిపోతూ ఇనుపరాడ్లు కనిపిస్తున్నాయి. గోడలన్నీ తేమ, పాచిపట్టి సిమెంటు ఊడిపోతోంది. ఫైళ్లు, గోడలు, కుర్చీలపై దుమ్ము ధూళి పేరుకుపోయింది. కంప్యూటర్లు, ఫైళ్లు, బీరువాలకు పాతచీరలు, చిన్నపాటి గుడ్డలతో కప్పిపెట్టడంతో చూసేందుకు అసహ్యంగా కనిపిస్తోంది. గాలి,వెలుతురు సరిగా లేక ఉద్యోగులు అతికష్టమ్మీద విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా చూసినా చిందర వందరగా పాతసామాన్లు పెట్టే గదిలా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నా మరమ్మతులు చేద్దామనే ఆలోచన కూడా ఉన్నతాధికారులకు రాకపోవడం గమనార్హం. – అనంతపురం అగ్రికల్చర్:


