బాధ్యతలను విస్మరిస్తే లక్ష్యం నెరవేరేదెలా? | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలను విస్మరిస్తే లక్ష్యం నెరవేరేదెలా?

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల ఆవరణలో నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ (ఎన్‌జెడ్‌హెచ్‌సీ) పేరుతో కొన్ని లక్ష్యాలను నిర్దేశించాము. క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వారు బాధ్యతలను విస్మరిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎలా సాధ్యమవుతాయని జిల్లా అధికారులు ప్రశ్నించారు. అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే లక్ష్యాల్లో పురోగతి సాధ్యమన్నారు. జిల్లా పరిషత్‌ రివ్యూ సెంటర్‌లో గురువారం నెట్‌ జీరో హెల్త్‌ క్యాంపస్‌ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ నోడల్‌ అధికారి, జిల్లా పరిషత్‌ సీఈఓ పీ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల్లో ఇదివరకే గుర్తించిన 46 విద్యాసంస్థల్లో నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు కేవలం కొన్ని విద్యాసంస్థల్లో మాత్రమే పనులు జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్‌, రైన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌, కమ్యూనిటీ కంపోస్ట్‌ గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. డ్వామా పీడీ సలీం భాష వివిధ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రం ఉపేక్షించమని, తక్షణమే నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓలు, ఈసీలు, బీసీ వెల్ఫేర్‌ డీడీ కుష్బూ కొఠారి, నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు హాజరయ్యారు.

ఎప్పటికప్పుడు

సమస్యల పరిష్కారం

ఆత్మకూరు: తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌, మ్యూటేషన్‌ ఫైళ్లు, ఎఫ్‌లైన్‌ పిటీషన్లను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలన్నారు. అనంతరం పి.యాలేరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌ ట్రూ థింగ్‌ పనులను తనిఖీ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్‌, తహసీల్దార్‌ లక్ష్మీనాయక్‌, సర్వేయర్‌ యమున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement