వైఎస్ జగన్‌తో తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, నయనతారెడ్డి దంపతులు
వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పటాస్ శ్రీకాంత్
రాప్తాడు రూరల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు గురువారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల ఓ అక్రమ కేసులో అరైస్టె బెయిల్‌పై విడుదలైన తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పటాస్ శ్రీకాంత్, తోపుదుర్తి నయనతారెడ్డి తదితరులు కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాలను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు, దాడులు, పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు సునీల్ దత్తారెడ్డి కూడా వైఎస్ జగన్‌ని కలిశారు.


